PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రశాంతంగా తొలిరోజు నామినేషన్ దాఖలు

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: జిల్లాలోని జెడ్పిటిసి కొలిమిగుండ్ల సంబంధించి మొదటిరోజు మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. అలాగే పాములపాడు మండలం Chelimilla ఎంపిటిసికి 1 నామినేషన్, ఆత్మకూరు మండలం సిద్దాపురం ఎంపీటీసీకి 2 నామినేషన్లు మొదటిరోజు దాఖలయ్యాయి. సర్పంచులకు సంబంధించి సి.బెళగల్ మండలం యనగండ్ల గ్రామపంచాయతీ సర్పంచ్ కు 2 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డ్ మెంబర్ కు సంబంధించి డోన్ మండలం గుమ్మకొండ గ్రామపంచాయతీ వార్డు స్థానానికి 1 నామినేషన్, గూడూరు మండలం మునగాల గ్రామ పంచాయతీ వార్డు స్థానానికి 1 నామినేషన్, పెద్ద కడుబూరు మండలం గవిగట్టు గ్రామపంచాయతీ వార్డ్ స్థానానికి 2 నామినేషన్లు, వెల్దుర్తి మండలం చెరుకులపాడు గ్రామపంచాయతీ వార్డ్ స్థానానికి 1 నామినేషన్లు దాఖలయ్యాయి.
బేతంచర్ల మున్సిపాలిటీకి సంబంధించి 2 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో బేతంచెర్ల మున్సిపాలిటీ 4 వార్డులో టిడిపి పార్టీ 1 నామినేషన్, 2 వార్డ్ లో బిజెపి పార్టీ నుంచి 1 నామినేషన్ దాఖలయ్యాయి. నందికొట్కూరు మున్సిపాలిటీ 10 వార్డ్, ఎమ్మిగనూరు మున్సిపాలిటీ 10 వార్డ్ లకు నామినేషన్ అసలు దాఖలు కాలేదు. తొలి రోజు నామినేషన్ల పర్వం ప్రశాంతంగా ముగిసింది.

About Author