గిరిజనుల సాంప్రదాయ వస్త్రధారణతో ప్రచారం
1 min readపల్లెవెలుగు వెబ్ ఓర్వకల్: ఓర్వకల్లు మండలం కొమ్మ చెరువు గుడుంబాయి తాండ లో తెలుగుదేశం పార్టీ “సూపర్ సిక్స్ శంఖారావం” కార్యక్రమంలో భాగంగా గ్రామంలో గురువారం నాడు పాణ్యం టిడిపి ఇన్చార్జి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి గిరిజనుల సంప్రదాయ వేషధారణతో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకాపా పాలన ప్రజలకు ఇబ్బందులకు గురి చేసిందన్నారు నాయకులు తమ స్వార్థం కోసం పేదల భూములు కూడా వదలలేదని ఈ ఎన్నికల్లో వైకాపాకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. టిడిపి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందని టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే. పరిశ్రమల కోసం స్థానికంగా భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలలో యువతకు స్థానికంగా ఉపాధి కల్పించేలా చొరవ తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నుండి 70 కుటుంబాలు గౌరు చరిత రెడ్డి మరియు మల్లెల రాజశేఖర్ సమక్షం లో తెలుగుదేశం పార్టీ లో చేరారు, వీరందరినీ తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారoగా ఆహ్వానించారు పార్టీ లో చేరినవారిలో లక్ష్మణ్ నాయక్, సుoకన్న నాయక్, సక్రె నాయక్, మాతృ నాయక్, పుల్లన్న నాయక్, హోనే నాయక్, శ్రీను నాయక్, రాజు నాయక్70 కుటుంబాలు చేరారు.ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్,మండల నాయకులు పాలకొలను సుధాకర్ రెడ్డి,గుట్టపాడు సర్పంచ్ మోహన్ రెడ్డి,గుడుంబాయి తాండ గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.