NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

27వ డివిజన్ లో ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని ఇంటింటా ప్రచారం..

1 min read

పెద్ద ఎత్తున పాల్గొన్న వైసిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు..

స్వాగతం పలికిన కార్పొరేటర్ బత్తిన విజయకుమార్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి  ఆళ్ల నాని  మే 13న జరగబోవు సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మన ఏలూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల నాని ఆదివారం సోదిమెళ్ళ  27వ డివిజన్  నుండి  కార్యకర్తలతో నాయకులతో ఎండను సైతం లెక్కచేయకుండా విస్తృత ప్రచారం చేశారు. కార్పొరేటర్ బత్తిన విజయకుమార్ ఆద్వర్యంలో భారీ గజమాలతో, పూల జల్లులతో మహిళలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికారు. ఆళ్ల నాని ప్రచారం నిర్వహిస్తు ఉండగా  వేలాది మంది ప్రజలు వచ్చి  నీరాజనాలు పలికారు. ప్రజలంతా ముక్తకంఠంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, ఆళ్లనాని జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో  ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ ఆదారిటీ చైర్మన్ బోద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గుడిదేశీ శ్రీనివాస్,  మార్కెట్ యార్డ్ చైర్మన్ నెరసు చిరంజీవి, డివిజన్ క్లస్టర్ మంచం మైబాబు,కార్పొరేటర్లు, కిలాడి దుర్గారావు, కో-ఆప్షన్ సభ్యులు సమ్మర్ పెదబాబు, మున్నుల జాన్ గురునాథ్ మరియు చలుమోలు సత్యనారాయణ, కొట్టు కోటేశ్వరరావు, జంగం అర్జున, కందుల చిన్ని, మొoడూరు ప్రభుదాస్, పానుగంటి అశోక్, అన్ని విభాగాల  చైర్మన్స్, అన్ని విభాగాల  డైరెక్టర్లు, ఏలూరు క్లస్టర్ అధ్యక్షులు,గుడి చైర్మన్లు,ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిలారు బుజ్జి, అభిమానులు కార్యకర్తలు మహిళా సోదరీమణులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

About Author