NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వివాహం కాన‌ప్ప‌టికీ రాబ‌ట్టుకోవ‌చ్చు.. కోర్టు సంచ‌ల‌న తీర్పు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : చ‌త్తీస్ఘ‌డ్ హైకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వివాహం కానప్పటికీ కుమార్తె తన తల్లిదండ్రుల నుంచి పెళ్లిఖర్చులను రాబట్టుకోవచ్చని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. హిందూ అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్, 1956లోని నిబంధనల ప్రకారం.. పెళ్లికాని కుమార్తె తన తల్లిదండ్రుల నుంచి వివాహ ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చని ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే 35 ఏళ్ల మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను బిలాస్‌పూర్‌లోని హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించింది. తన తండ్రి నుంచి వివాహ ఖర్చులు ఇప్పించాలని ఆమె వేసిన పిటిషన్‌ను జస్టిస్ గౌతమ్ భాదురి, జస్టిస్‌ సంజయ్ ఎస్ అగర్వాల్‌లతో కూడిన ధర్మాసనం మార్చి 21న విచారణకు అనుమతించిందని పిటిషనర్ న్యాయవాది ఎకె తివారి తెలిపారు.

                                        

About Author