హాల్ మార్క్ లేకుంటే బంగారం కొనొచ్చా..?
1 min readపల్లెవెలుగు వెబ్: బంగారం మీద భారతీయులకున్న మోజుకు ప్రపంచంలో ఎవరికీ ఉండదు. బంగారం దిగుమతులే ఇందుకు ఉదాహరణ. ఏటా వేల టన్నుల బంగారం మన దేశానికి దిగుమతి అవుతోంది. ఆ ముడి బంగారాన్ని వివిధ ఆభరణాల రూపంలోకి మార్చి వినియోగదారులకు అమ్ముతున్నారు. అయితే.. ఈ బంగారు ఆభరణాలు ఎంత స్వచ్చమైనవి, ఎన్ని కేరట్లు ఉన్నాయన్న సంగతి చాలా మంది వినియోగదారులకు అసలు తెలియదు. కేవలం దుకాణదారుడి మీద నమ్మకంతో కొనేస్తారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధన బంగారు ఆభరణాల వినియోగదారులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. హాల్ మార్క్ లేని నగలు జూన్ 1 నుంచి విక్రయించకూడదని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి ఆభరణానికి హాల్ మార్క్ తప్పనిసరి అని ప్రకటించింది. ఆభరణాల విక్రయదారులు బ్యూరో ఆఫ్ స్టాండర్స్డ్ ఇండియా వద్ద తమ పేరు నమోదు చేసుకోవాలని తెలిపింది. ఇప్పటి వరకు స్వచ్చందంగా హాల్ మార్క్ చేసుకుంటున్న వినియోగదారులు .. ఇప్పుడు తప్పనిసరిగా హాల్ మార్క్ బంగారు ఆభరణాలు అమ్మాలి.
హాల్ మార్క్ అంటే ఏమిటి ? : బంగారం కొనేటప్పుడు హాల్ మార్క్ తప్పనిసరి ఉండాలి. వినియోగదారులు కొంటున్న బంగారం స్వచ్చత, ఎన్ని కేరట్లు ఉన్నాయన్న విషయంలో హాల్ మార్క్ ఉపయోగపడుతుంది. హాల్ మార్క్ ద్వార బంగారం స్వచ్చత, ఎన్ని కేరట్లు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటి నుంచి విక్రయదారులు 14,18,22 కేరట్ల బంగారాన్ని మాత్రమే అమ్మాలి.