కండోమ్ లు కూడ అడుగుతారేమో ?
1 min readపల్లెవెలుగువెబ్: ‘‘మీ కోరికలకు హద్దే ఉండదు. ప్రభుత్వం ఇస్తే ఉచిత జీన్ ఫ్యాంట్లు, అందమైన షూలు కూడా కావాలంటారు. భవిష్యత్‌లో కుటుంబ నియంత్రణ కోసం కండోమ్‌లు కూడా అడుగుతారేమో’’ ఇవి బిహార్‌లో ఓ ఐఏఎస్ అధికారిణి వ్యాఖ్యలు. రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధి సంస్థ డైరెక్టర్ కూడా అయిన ఆమె, శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా పంపిణీ చేయాలని అడిగిన విద్యార్థినులపై విరుచుకుపడ్డారు. ఐఏఎస్ అధికారిణి హర్‌జోత్ కౌర్ బమ్రా, కొంతమంది విద్యార్థినులకు మధ్య జరిగిన ఈ సంభాషణల వీడియో వైరల్ అవుతోంది.