NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పే ద‌మ్ముందా ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కు మంత్రి కేటీఆర్ బ‌హిరంగ లేఖ రాశారు. బండి సంజ‌య్ రేపు ఇందిరాపార్క్ వ‌ద్ద నిరుద్యోగ దీక్ష చేప‌ట్ట‌నున్నారు. సంజ‌య్ ది నిరుద్యోగ దీక్ష కాద‌ని, అవ‌కాశ‌వాద దీక్ష అని విమ‌ర్శించారు. ఉపాధి అవ‌కాశాల్లో బీజేపీ వైఫ‌ల్యాల‌ను కేటీఆర్ ఎండ‌గ‌ట్టారు. దేశ నిరుద్యోగ యువ‌త‌కు బీజేపీ ఏం చేసిందో చెప్పాల‌న్నారు. కేంద్రం వ‌ల్ల రాష్ట్రానికి ద‌క్కిన ఉద్యోగాల వాటా ఎంతో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. తెలంగాణ‌కు వ‌చ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టు ర‌ద్దు చేసింది బీజేపీ కాదా ? అని ప్ర‌శ్నించారు. యువ‌త‌ను న‌మ్మించి న‌ట్టేట ముంచిన చ‌రిత్ర బీజేపీదేన‌న్నారు. 40 ఏళ్ల‌లో ఏన్న‌డూ లేని నిరుద్యోగం పెరిగింద‌న్నారు. కేంద్రం ఇచ్చిన ఉద్యోగాల పై శ్వేత‌పత్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు.

                                          

About Author