సీపీఎస్ రద్దును.. సీఎం దృష్టికి తీసుకెళ్లండి..!
1 min read– పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఫ్యాప్టో సభ్యులు
పల్లెవెలుగు వెబ్, కర్నూలు : సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని గుర్తు చేయాలని కోరుతూ FAPTO రాష్ట్ర పరిశీలకులు తిమ్మన్న నాయకత్వంలో సోమవారం పాణ్యం నియోజకవర్గ శాసనసభ్యుడు కాటసాని రాంభూపాల్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిమ్మన్న మాట్లాడుతూ సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం హామీ ఇచ్చారని, కానీ రెండేళ్లు దాటినా రద్దు చేయలేదన్నారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సీపీఎస్ రద్దు విషయమై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో FAPTO సెక్రటరీ జెనెరల్ రంగన్న APTF 257, ఆప్టా జిల్లా అధ్యక్షుడు మునగాల మధుసూదన్ రెడ్డి ,STU జిల్లా ప్రధాని కార్యదర్శి ఎస్ గోకారి, రామకృష్ణ APTF 1938, అబ్రహం లింకన్ DTF మరియు ఎల్లారెడ్డి అప్టా పాల్గొన్నారు.