ఫార్మేటివ్ పరీక్షలు రద్దు !
1 min readపల్లెవెలుగువెబ్ : నాలుగో విడత ఫార్మేటివ్ పరీక్షలు రద్దు చేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. పాఠశాల విద్యార్థులకు నిర్దేశించిన సిలబస్ పూర్తికాకపోవడంతో నాలుగో విడత ఫార్మేటివ్ పరీక్షల్ని విద్యాశాఖ రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ ఏడాది కొవిడ్ కారణంగా ఆగస్టు 16వ తేదీన పాఠశాలలు తెరిచారు. దానికి తగినట్లుగానే సిలబ్‌సను కూడా తగ్గించారు. అయినా ఆ మేరకు కూడా సిలబస్ పూర్తికాలేదని సమాచారం. తొలి మూడు ఫార్మేటివ్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా నాలుగో ఫార్మేటివ్ పరీక్షల్లో మార్కులను ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారులకు నిర్దేశించినట్లు తెలిసింది.