టెండర్లు రద్దు
1 min readపల్లెవెలుగు వెబ్, మహానంది : కర్నూలు జిల్లా మహానంది దేవస్థానం వారు ఈనెల 28న నిర్వహించనున్న టెండర్లు కొన్ని రద్దు చేయనున్నట్లు సమాచారం . ద్విచక్ర వాహనాలకు మరియు క్షేత్రంలోని కళ్యాణ మండపాలనందు డెకరేషన్ చేయుట తదితర వాటికి నిర్వహించాల్సిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు తెలుస్తోంది. దేవస్థానం నిర్వాహకులు తీసుకున్న కొన్ని నిర్ణయాలు …వివాదాస్పదంగా మారాయి. దీనికితోడు భక్తులు , మండల ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం.