ఆ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు !
1 min readపల్లెవెలుగువెబ్: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో యాక్టివ్గా లేని 253 రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి 25 పార్టీలు రద్దు.. అందులో కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ కూడా ఉంది. ఎలక్షన్ కమిషన్ దగ్గర కుప్పలు తెప్పలుగా పార్టీలు రిజిష్టర్ అయ్యాయి. అందులో చాలా పార్టీలు ఇప్పుడు యాక్టివ్గా లేవు. ఎన్నికల్లో పోటీ చేయడంలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం పార్టీల ప్రక్షాళన మొదలుపెట్టింది. క్రియాశీలకంగా లేని పార్టీలపై వేటు వేస్తోంది. దేశవ్యాప్తంగా క్రియాశీలకంగా లేని 253 రాజకీయ పార్టీల గుర్తింపు, వాటి గుర్తులను కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసింది.