NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సాగు చ‌ట్టాల ర‌ద్దు.. లోక్ స‌భ‌లో ఆమోదం

1 min read

పల్లెవెలుగు వెబ్ ​:గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేశారు. లోక్ స‌భ‌లో విప‌క్షాల గంద‌ర‌గోళం మ‌ధ్య ఈ బిల్లును ర‌ద్దు చేశారు. బిల్లు పై చ‌ర్చ జ‌ర‌గాల‌ని విప‌క్ష‌నేత‌లు ప‌ట్టుబ‌ట్టారు. వీటిని స్పీక‌ర్ ఓం బిర్లా తిర‌స్క‌రించారు. దీంతో మూజువాణి ఓటుతో సాగు చ‌ట్టాల ర‌ద్దుకు లోక్ స‌భ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన చ‌ట్టాల‌ను రైతుల నిర‌స‌న‌ల నేప‌థ్యంలో ర‌ద్దు చేసింది. దీనికి సంబంధించిన బిల్లును లోక్ స‌భ‌లో సోమ‌వారం ప్ర‌వేశ‌పెట్టారు. కేంద్ర మంత్రి న‌రేంద్ర సింగ్ తోమ‌ర్ ఈ బిల్లును లోక్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. దీనిపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని కాంగ్రెస్ నేత అధీర్ రంజ‌న్ చౌద‌రి ప‌ట్టుబ‌ట్టారు. అయితే.. ఈ చ‌ట్ట‌ల పై ఇప్ప‌టికే మోదీ రైతుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన నేప‌థ్యంలో చ‌ర్చ జ‌ర‌ప‌డం అన‌వ‌స‌ర‌మ‌ని బీజేపీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డ్డారు.

https://ssl.gstatic.com/ui/v1/icons/mail/no_photo.pngReplyForward

About Author