మల్లికార్జున రిజర్వాయర్ ప్రాజెక్ట్ రద్దు…ఆర్డిఓ
1 min read-ప్రజల్లో నెలకొన్న సందేహాలకు తెర
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని పలు గ్రామాలలో మల్లికార్జున రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణం రద్దు అయినట్లు ఆత్మకూరు ఆర్డిఓ ఎం.దాసు అన్నారు. మండలంలో రిజర్వాయర్ ప్రాజెక్టు వస్తుందనే ఊహాగానాలకు తెరపడింది.గత కొన్ని నెలల కిందట మండలంలోని దేవనూరు, చింతలపల్లి,గుడిపాడు,49 బన్నూరు,చౌటుకూరు తదితర గ్రామాలలో మల్లికార్జున రిజర్వాయర్ నీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టుట మరియు ప్రాజెక్టు నిర్మించే మ్యాప్ ను కొద్ది నెలల కిందట ప్రభుత్వం విడుదల చేసింది.కానీ ఈ రిజర్వాయర్ రావడం వలన మా సారవంతమైన పొలాలు దెబ్బతింటాయని అంతేకాకుండా మేము ఎన్నో లక్షలు వెచ్చించి ఇండ్లు కట్టుకున్నామని వీటన్నిటిని వదులుకొని మేము వెళ్లాలా అంటూ అదే విధంగా ఈ రిజర్వాయర్ రావడం వల్ల మా పొలాలు అమ్మటానికి తక్కువ ధరకే అడుగుతున్నారంటూ ఈ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వివిధ రూపాల్లో ధర్నాలు రాస్తారోకోలు కలెక్టరేట్ ముట్టడి మరియు గడప గడపకు వచ్చిన నందికొట్కూరు ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ కు రిజర్వాయర్ మాకు వద్దే వద్దని ఎమ్మెల్యేకు మొర పెట్టుకుంటూ ఎమ్మెల్యే చుట్టూ ప్రజలు చుట్టుకున్నారు.మండలంలో ప్రాజెక్టు రద్దు అయిన విషయాల గురించి శుక్రవారం మధ్యాహ్నం ఆర్డిఓ దాసు మరియు తహసిల్దార్ ఎస్.ప్రకాష్ బాబు పాత్రికేయులకు తెలియజేశారు.గతంలో గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహిస్తే ప్రజలు సహకరించే వారు కాదని ప్రస్తుతం చేపడుతున్న రీ సర్వేకు గ్రామాల్లో ఉన్న రైతులందరూ సహకరించాలని తహసిల్దార్ రైతులను కోరారు.ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ కృష్ణుడు,ఆర్ఐ బాష పాల్గొన్నారు.