NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

17న స్పందన కార్యక్రమం రద్దు.. జిల్లా కలెక్టర్

1 min read

– డివిజన్,మండల, మునిసిపాలిటీ ల్లో యథాతథం

పల్లెవెలుగు, వెబ్​ కర్నూలు: ఈ నెల 17 వ తేదీన జిల్లా కేంద్రం సునయన ఆడిటోరియంలో నిర్వహించే స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే డివిజన్,మండల, మునిసిపాలిటీ ల్లో స్పందన కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ నెల 17 వ తేదీన రైతు భరోసా జిల్లా స్థాయి కార్యక్రమం కర్నూలు సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్న సందర్భంగా కర్నూలు సునయన ఆడిటోరియంలో నిర్వహించే స్పందన కార్యక్రమము మాత్రమే రద్దు చేయబడినదని కలెక్టర్ తెలిపారు.జిల్లాలోని అన్ని డివిజన్, మండల, మున్సిపాలిటీల్లో స్పందన కార్యక్రమము యధాతధంగా జరుగుతుందన్నారు.. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

About Author