క్యాన్సర్ మరణాలు తగ్గించాలి
1 min read
రొమ్ము, అండాశయ క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించి.. వైద్యం అందించాలి
- ప్రభుత్వ మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా. చిట్టి నర్సమ్మ
- ఓమెగా హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
కర్నూలు, న్యూస్ నేడు:మహిళలకు ప్రబలుతున్న రొమ్ము, అండాశయ క్యాన్సర్లను ముందస్తుగా గుర్తించి… వారి జీవన ప్రమాణాలు పెంచేలా వైద్యం అందించాలని సూచించారు ప్రభుత్వ మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా. చిట్టి నర్సమ్మ. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆదివారం నగరంలోని ఐఎంఏ భవన్ లో ఓమెగా హాస్పిటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ చికిత్స, తదితర అంశాలపై జూనియర్ వైద్యులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా. చిట్టి నర్సమ్మ, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. ముందస్తు వైద్య పరీక్షలు మరియు చికిత్స విధానాలలో పరిశోధనల ద్వారా లక్ష్యాలను సాధించవచ్చన్నారు. అనంతరం ఓమెగా క్యాన్సర్ హాస్పిటల్ వైద్యులు సీనియర్ సర్జికల్ అంకాలజిస్టు డా.బి రవీంద్ర బాబు , సీనియర్ రేడియోషన్ అంకాలజిస్టు డా. వెంకట రెడ్డి, డా. ఉమా మహేశ్వర రెడ్డి, మెడికల్ అంకాలజిస్టు డా. సుధాకర్ , ఐఎంఏ వైద్యులు డా. ఆర్సి నాయుడు, ప్రెసిడెంట్ మరియు డా. మాధవి , ట్రెజరర్ ఐఎంఏ మాట్లాడారు. ఈ సదస్సులో కర్నూలు, నంద్యాల, హైదరాబాద్ , గుంటూరు మరియు వైజాగ్ నుంచి ప్రముఖ క్యాన్సర్లు వైద్యులు పాల్గొన్నారు. డా. నాగ కిశోర్, డా. రవి శంకర్ సీనియర్ క్యాన్సరు వైద్యులు , ఓమెగా హాస్పిటల్ డా. ప్రకాశ్, డైరెక్టర్, స్టేట్ క్యాన్సర్ ఇన్సిస్ట్యూట్ కర్నూలు పాల్గొని, ఆధునాతన శస్ర్త చికిత్స విధానాలు, మన భారత దేశంలో స్త్రీలలో ప్రబలుతున్న రొమ్ము, అండాశయ మరియు గర్భసంచి క్యాన్సర్ల గురించి చర్చించారు. ఈ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించి, ప్రభుత్వ మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ పరస్పర సహకారంతో ప్రజలకు ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించి, మరణాలను నివారించ వచ్చని చర్చలు జరిపారు. సదస్సులో జూనియర్ వైద్యులు, పిజి విద్యార్థులు పాల్గొన్నారు.
