PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొవ్వొత్తుల వెలుగుతో నిరసన…

1 min read

పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి:  మండల కేంద్రమైన చాగలమర్రిలో గాంధీ సెంటర్ లో అంగన్వాడి కార్యకర్తలు అంగన్వాడి సహాయకులు వెలుగుతున్న కొవ్వొత్తులు చేతపట్టుకుని ఆదివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ మాట్లాడుతూ 13 రోజులుగా అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం నిరవదిక సమ్మె చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించడము లేదన్నారు. వేతన చట్ట ప్రకారం 26 వేలు వేతనంతో పాటు రిటైర్డ్ బెనిఫిట్స్ ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేసారు. సమ్మె కు మద్దతుగా సిపిఎం హమాలి సంఘం గౌరవ అధ్యక్షులు గుత్తి నరసింహులు కొవ్వొత్తుల చేతబట్టి నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ టి యు సి మండల నాయకురాలు సుజాత, ఇందుమతి, భార్గవి, సి, ఐ టి యు సంజమ్మ, రజిని, రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు.

About Author