NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేక‌.. మ‌ట‌న్ మార్టుల్లో ఉద్యోగమిస్తారా ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మ‌ట‌న్ మార్టులు నిర్వహ‌ణ‌కు సిద్ధం కావ‌డం పై తెదేపా ప్రధాన కార్యద‌ర్శి బుద్ధా వెంక‌న్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల పొట్టకొట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం మ‌ట‌న్ మార్టులు తీసుకొస్తోంద‌ని ఆరోపించారు. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉద్యోగాలు ఇవ్వలేక‌.. మ‌ట‌న్ మార్టుల్లో యువ‌త‌కు ఉద్యోగాలు ఇస్తారా ? అని ప్రశ్నించారు. రాష్ట్రానికి కంపెనీలు తీసుకొచ్చే స‌త్తాలేని రాష్ట్ర ప్రభుత్వం మ‌ట‌న్ మార్టుల నిర్వహ‌ణ‌కు సిద్ధమైంద‌ని విమ‌ర్శించారు. క‌ల్తీ మ‌ద్యంతో అనేక మంది చ‌నిపోయార‌ని, ఇప్పుడు క‌ల్తీ మాంసం తీసుకొస్తారా అన్ని ప్రశ్నించారు. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స‌ల‌హాతోనే జ‌గ‌న్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు అర్థమ‌వుతోంద‌ని బుద్ధా వెంక‌న్న అన్నారు.

About Author