PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నెల‌నెలా జీతాలు చెల్లించ‌లేరు కానీ.. యాడ్స్ కోసం రూ. 36 కోట్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆప్ అంటే ‘అరవింద్ అడ్వర్టైజ్ మెంట్ పార్టీ’ గా మారిపోయిందని.. ఆ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అవినీతి రాజకీయాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. త్వరలో ఎన్నికలు జరగనున్న గుజరాత్ లో ప్రకటనల కోసం పంజాబ్ ప్రభుత్వ సొమ్మును ఖర్చు పెట్టిస్తున్నారని ఆరోపించింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ కుమార్ ఈ అంశంపై మాట్లాడారు. భగవంత్‌ మాన్‌ నేతృత్వంలోని పంజాబ్‌ ప్రభుత్వం ఉద్యోగులకు సరిగా జీతాలు కూడా చెల్లించలేకపోతోందని.. అదే గుజరాత్‌లో యాడ్స్ కోసం గత రెండు నెలల్లో రూ.36 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు.

                                        

About Author