NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పునీత్ కు ఏమైందో ఖ‌చ్చితంగా చెప్పలేం !

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రముఖ క‌న్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ మ‌ర‌ణం యావ‌త్ క‌న్నడ ప్రజానీకానికి, పునీత్ కుటుంబానికి తీర‌ని శోకం మిగిల్చింది. పునీత్ మ‌ర‌ణానికి కారణం ఖచ్చితంగా చెప్పలేమ‌ని.. పునీత్ ఫ్యామిలీ డాక్టర్ ర‌మ‌ణారావు చెప్పారు. ఆరోగ్యం గురించి పునీత్ ఎంతో శ్రద్ధ తీసుకునేవాడ‌ని, పునీత్ ను చూసి నేర్చుకోవాల‌ని ఎంతో మందికి స‌ల‌హా ఇచ్చేవాడిన‌ని డాక్టర్ చెప్పారు. అదో హఠాత్పరిణామం అని అన్నారు. ఇది గుండె పోటు కాద‌ని చెప్పారు. గుండె హ‌ఠాత్తుగా ఆగిపోవ‌డం (కార్డియాక్ అరెస్ట్ ) అని అన్నారు. కార్డియాక్ అరెస్ట్ కు దారితీసే అంశాలు చాల‌నే ఉంటాయి. కానీ పునీత్ లో అలాంటి ల‌క్షణాలు ఏవీ కనిపించ‌లేద‌ని అన్నారు. పునీత్ కు మ‌ధుమేహం, అసాధార‌ణ ర‌క్తపోటు లాంటివి లేవ‌ని అన్నారు. అప్పూ విష‌యంలో ఏం జ‌రిగిందో చెప్పడం క‌ష్టమ‌ని అన్నారు.

About Author