ధరలు పెరుగుతాయని రాత్రిళ్లు నిద్రపోవడంలేదు !
1 min read
పల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధరల పెరుగుదల సమస్య ఒక్కొక్కసారి తనను రాత్రివేళల్లో నిద్రపోనివ్వడం లేదని, అయితే ఇది కేవలం పాకిస్థాన్ సమస్య మాత్రమే కాదని ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ద్రవ్యోల్బణానికి రెండు దశలు ఉన్నాయన్నారు. తాము ప్రభుత్వంలోకి వచ్చినపుడు భారీ కరంట్ అకౌంట్ లోటును ఎదుర్కొనవలసి వచ్చిందని, దానివల్ల దిగుమతుల ధరలు విపరీతంగా పెరిగాయని చెప్పారు. ప్రస్తుత ద్రవ్యోల్బణం కరోనా వైరస్ మహమ్మారి వంటి అంతర్జాతీయ పరిస్థితుల ఫలితమని తెలిపారు.