ఉద్యమాన్ని నిర్బంధంతో ఆపలేరు : నారా లోకేష్
1 min readపల్లెవెలుగు వెబ్ : నిరుద్యోగుల ఉద్యమాన్ని నిర్బంధంతో ఆపలేరని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. వైకాపా రాజకీయ నిరుద్యోగులకు జగన్ ఉద్యోగాలిచ్చారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఎక్కడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టులతో యువతను అడ్డుకోవడం అసాధ్యమని అన్నారు. నిర్బందాలు అధిగమించి యువత సీఎం ఇంటిని ముట్టడించిందని, ఇప్పటికైన సమస్య పరిష్కరించాలని కోరారు. ఎంతమంది పోలీసులు వచ్చినా ఉద్యమాన్ని ఆపలేరని, కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.