కొండలు, గుట్టల్ని కనపడనీయవా క్యాష్ ప్రసాదూ?!
1 min read
పల్లెవెలుగు వెబ్ ఆదోని: పాదయాత్ర దారిలో అక్రమ గ్రావెల్ టిప్పర్ ను గమనించిన యువనేత లోకేష్ అక్కడ సెల్ఫీ దిగి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గత మూడురోజులుగా ఆదోని నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాష్ ప్రసాద్ అవినీతి చిట్టా నేను బయటపెడుతుంటే ఆయనేమో బూతుల పంచాంగం విన్పిస్తున్నాడు. క్యాష్ ప్రసాద్ నేతృత్వంలో ఎర్రగట్టుకొండను తవ్వేసి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న దృశ్యమిది. రోజూ 50టిప్పర్ల ఎర్రమట్టిని టిప్పర్ రూ.5వేల చొప్పున అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో కొండలు, గుట్టలు కన్పించకుండా చేస్తానని జగన్ రెడ్డి వద్ద ఏమైనా శపథం చేశావా ఎమ్మెల్యే గారూఅంటూ చురకలంటించారు.