PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హంద్రీ నీవా  సామర్థ్యాన్ని 70 టీఎంసీలకు పెంచాలి…సీపీఎం 

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: రాయలసీమ  సాగునీటి వనరులకు వరప్రసాదిని అయిన హంద్రీ, నీవా సామర్థ్యాన్ని 70 టీఎంసీలకు పెంచాలని, తద్వారా రాయలసీమ కరువుకు శాశ్వత  విముక్తి కల్పించాలని సిపిఎం జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా డి గౌస్ దేశాయ్ జిల్లా నాయకులు బి వీర శేఖర్ లు డిమాండ్ చేశారు.బుధవారం  సిపిఎం పార్టీ నాయకత్వంలోని బృందం పందికొన రిజర్వాయర్ ను అదేవిధంగా హంద్రీనీవా ప్రధాన కాలవను  కామ్రేడ్ గౌస్ దేశాయి నాయకత్వంలో వీరశేఖర్, రంగారెడ్డి, దస్తగిరి ,సురేంద్ర, గోపాలు, రమేష్ తదితరులు సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ, ప్రస్తుతం హంద్రీనీవా పూర్తి సామర్థ్యం 40 టీఎంసీలుగా ఉందని, అయితే హంద్రీనీవా ను దాదాపు కుప్పం వరకు తీసుకోవాలని లక్ష్యంతో ప్రభుత్వ ఆలోచన మేరకు హంద్రీనీవా సామర్థ్యాన్ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రాయలసీమ పశ్చిమ ప్రాంతంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను రాయలసీమ సాగునీటికి హంద్రీ నీవా నే ప్రధాన ఆధారమని తెలిపారు. ఇప్పటికే క్రిష్ణగిరి ,పందికొన, జీడిపల్లి, గొల్లపల్లి ల దగ్గర రిజర్వాయర్లు నిర్మించి ఆయా జిల్లాల్లో రైతాంగానికి సాగునీటికి ఉపయోగపడుతుందని, అందువలన హంద్రీనీవా సామర్థ్యాన్ని 70 టీఎంసీలకు పెంచడం ద్వారా ఈ ప్రాంతాన్ని కరువు నుండి శాశ్వతంగా విముక్తి కల్పించే అవకాశం ఉందని అన్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం  చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అలాగే హంద్రీ,నీవా మొదటి దశ పనులు కూడా నేటికీ పూర్తి కాలేదని అన్నారు. కర్నూలు జిల్లాలో అనేక చోట్ల హంద్రీ,నీవా పెండింగ్ పనులు ఉన్నాయని తెలిపారు. హంద్రీనీవా కింద ఉన్న 32 చెరువులకు  నీళ్లు మళ్లింపు కార్యక్రమాన్ని సాగదీస్తున్నారని,  పంటకాల్వల ద్వారా రైతులకు సాగునీరు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఏళ్లు గడుస్తున్నా పంట కాలువల మాట ఎత్తట్లేదని విమర్శించారు. హంద్రీ,నీవా మొదటి దశ పూర్తి, హంద్రీనీవా సామర్థ్యం పెంపు పంట కాలువలు నిర్మాణం, అదేవిధంగా పెండింగ్ పనులు  పూర్తి కోసం సిపిఎం  రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ప్రజా ఆందోళనలు  చేయబోతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ బాగా స్వాములు కావాలని ఆయన ఈసందర్భంగాపిలుపునిచ్చారు.

About Author