NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మిలిట‌రీ ఆస్పత్రిలో లైఫ్ స‌పోర్ట్ పై కెఫ్టన్ వ‌రుణ్ సింగ్

1 min read

పల్లెవెలుగు వెబ్​ : త‌మిళ‌నాడులోని కున్నూరులో జ‌రిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సీడీఎస్ బిపిన్ రావత్ తో స‌హా 12 మంది మృతి చెందిన విష‌యం తెలిసిందే. అయితే.. ఈ దుర్ఘట‌న‌లో తీవ్రమైన గాయాల‌తో కెప్టన్ వ‌రుణ్ సింగ్ ప్రాణాల‌తో బ‌య‌టపడ్డారు. ప్రస్తుతం మిల‌ట‌రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేర‌కు కేంద్ర ర‌క్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఓ ప్రక‌ట‌న చేశారు. తీవ్రంగా గాయ‌ప‌డిన కెప్టన్ వ‌రుణ్ సింగ్ ప్రస్తుతం లైఫ్ స‌పోర్ట్ పై ఉన్నార‌ని తెలిపారు. ఆయ‌న‌ను కాపాడేందుకు అన్ని విధాల ప్రయ‌త్నం చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం వెల్లింగ్టన్ మిలిట‌రీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, అవ‌స‌ర‌మైతే బెంగళూరు క‌మాండ్ ఆస్పత్రికి త‌ర‌లిస్తామ‌ని రాజ్ నాథ్ సింగ్ చెప్పారు.

About Author