NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కారు బోల్తా .. మున్సిపల్ డీఈ కి గాయాలు

1 min read

– చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలింపు..
– సకాలంలో స్పందించిన మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బాని, పట్టణ ఎస్ఐ ఎన్ వి రమణ..
పల్లెవెలుగువెబ్​, నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణ పోలీస్​ స్టేషన్​ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి ప్రమాదవశాత్తు కారు బోల్తా పడటంతో ఆత్మకూరు మున్సిపల్ డీఈ నరేష్ కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నందికొట్కూరు మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బాని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్ఐ ఎన్ వి రమణ తన సిబ్బంది తో కలిసి ప్రమాద స్థలానికి చేరుకున్నారు. బాధితులను చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఘటన వివరాలు స్థానికులు, పోలీసుల కథనం మేరకు… ఆత్మకూరు మున్సిపాలిటీ డీఈ నరేష్ పనులు పూర్తి చేసుకుని మంగళవారం అర్ధరాత్రి సమయంలో TS 08 GV 8444 ఇటికా కారులో ఆత్మకూరు నుంచి కర్నూలు కు బయలుదేరారు. నందికొట్కూరు కోర్టు సమీపంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. డివైడర్​ను బలంగా ఢీకొట్టడంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. డీఈ కి గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ రబ్బాని, పట్టణ ఎస్ఐ రమణ సకాలంలో స్పందించారు. క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి 108 కి సమాచారం అందించారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న డీఈ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సకాలంలో స్పందించిన వైస్ చైర్మన్, పట్టణ ఎస్ఐ లకు స్థానికులు అభినందించారు.

About Author