PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్ వైసిపి

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: ఇసుక,మద్యం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్ గా వైసీపీ మారిపోయిందని టిడిపి మండల యూత్ అధ్యక్షులు రంగస్వామి నాయుడు,ఉపాధ్యక్షుడు జయపాల్,మైనారిటీ నాయకులు భరతం రహంతుల్లా,గోవర్ధన్ నాయుడు,పూజారి లక్ష్మి కాంత్ స్వామీ,మునిస్వామి విమర్శలు గుప్పించారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ శాసనసభ్యులు డాక్టర్ బీవీ జయనగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇసుక,మద్యం అక్రమరవాణా తో వైసీపీ ప్రభుత్వం కోట్లు గడిస్తోందన్నారు. గోనెగండ్లలో ఇసుక అక్రమ రవాణాను అధికారులే వ్యాపారంగా మార్చుకొని లక్షల్లో ఆదాయం వస్తోందన్నారు.కొందరు అధికారులు ఇసుక అవినీతి పరులతో చెట్టపట్టాల్ వేసుకొని వారితో సక్యత్తగా తిరుగుతుండడం ప్రజలందరూ గమనిస్తున్నారని ఇలాంటి వారికీ,వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి అని హెచ్చరించారు.టిడిపి హయాంలో అభివృద్ధి వైసీపీ పాలలో అభివృద్ధి ఏ విధంగా ఉందో ప్రజలను అడిగి తెలుసుకోవాలాన్నారు. చంద్రబాబు నాయుడు తోనే గ్రామాలన్నీ అభివృద్ధి బాటలో నడిచాయని అన్నారు.2024 లో సీఎంగా చంద్రబాబు నాయుడు,ఎమ్మిగనూరు ఎమ్మెల్యే గా బీవీ జయనగేశ్వర రెడ్డి గారిని గెలిపించుకుంటామనిఅన్నారు.ఎప్పుడు ఎన్నికలు వచ్చినా చంద్రబాబు నాయుడే మా నాయకుడు సీఎం అని అన్నారు.వైసీపీని భూస్థాపితం చేసేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉండారని అన్నారు.ఈ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల యూత్ నాయకులు నాయక్ షాషా వలి,గోపాల్ నాయుడు హాజరయ్యారు.

About Author