PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘బ్రాండెడ్’ ఆభరణాలకు కేరాఫ్.. ‘మలబార్’ : ఎమ్మెల్యే శ్రీదేవి

1 min read

పల్లెవెలుగు వెబ్​,కర్నూలు: కళానైపుణ్యం..హుందాతనంతో కూడిన బ్రాండెడ్​ బంగారు ఆభరణాలు మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​లో లభిస్తాయన్నారు పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి. శుక్రవారం  కర్నూలు బ్రాంచ్ స్టోర్​ హెడ్​ ఫయిజ్​ ,మార్కెటింగ్​ మేనేజర్​ నూర్​వుల్లా నేతృత్వంలో ఏర్పాటు చేసిన బ్రాండెడ్​ బంగారు ఆభరణాల ప్రదర్శన కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీదేవి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.

ప్రదర్శనలో మలబార్​ గోల్డ్​ అండ్​ డైమండ్స్​ వారి బ్రాండ్ల సమాహారం ‘ మైన్​’ ధ్రువీకరించబడిన వజ్రాభరణాలు, వివాహ మరియు పార్టీ సంబరాల కోసం ‘ ఎరా’ అన్కట్​ వజ్రాలతో పొదిగిన విశిష్ట శ్రేణి, ‘ ప్రెష్యా’ జాతి రత్నాభరణాల సముదాయం, ‘ ఎత్నిక్స్​’ హస్త కళా నైపుణ్యాతతో తయారైన ఆభరణాలు, ‘డివైన్​’ భారతీయ ప్రాచీన సంప్రదాయం వ్యక్తం చేసే ఆభరణాలు… చిన్నారుల కోసం ‘ స్టార్లెట్​’ ఆభరణాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ మలబార్​ సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 28 పాయింట్ల నాణ్యత పరీక్ష నిర్వహించిన ఐజీఐ మరియు జీఐఏ ధ్రువీకరించిన వజ్రాభరణాలు, బైబ్యాక్​ గ్యారెంటీ, నాణ్యతను తనిఖీ చేయడానికి క్యారెట్​ ఎనలైజర్​, జీవితకాల నిర్వహణ మరియు బాధ్యతాయుతమైన మూలాల నుంచి బంగారం సేకరణ వంటి వాగ్ధాలను ‘మలబార్​’ సంస్థ అందిస్తుందన్నారు. కార్యక్రమంలో షోరూం సిబ్బంది, వైసీపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Author