PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్నేహానికి కేరాఫ్​..గడివేముల జెడ్పీ పూర్వ విద్యార్థులు

1 min read

ఆపదలో ఉన్న స్నేహితుల కుటుంబాలను ఆదుకున్న అ‘పూర్వ’బ్యాచ్​

 పల్లెవెలుగువెబ్​, గడివేముల: ఎందరో మహానుభావులు.. కవులు.. రచయితలు…స్నేహం గురించి తమ భావాలను వెలిబుచ్చారు. స్నేహబంధం గొప్పదని భావించిన గడివేముల జిల్లా పరిషత్​ పూర్వవిద్యార్థులు… స్నేహానికి శాశ్వత చిరునామాగా మారారు. కర్నూలు జిల్లా గడివేముల జిల్లా పరిషత్​ పాఠశాలలో 1989లో (94వ బ్యాచ్)​ పదో తరగతి విద్యార్థులు స్నేహానికి స్నేహబంధానికి నిదర్శనమయ్యారు.

వివిధ వృత్తులలో స్థిరపడి…అనేక హోదాల్లో ఉన్నా… తమ స్నేహ బంధం మరువమంటూ… ఆపదలో ఉన్న స్నేహితుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. 94 బ్యాచ్ స్నేహితులలో ఒకరైన రవికుమార్ అనారోగ్యంతో చనిపోవడంతో అతని కుటుంబానికి అండగా ఉంటామంటూ రూ.10వేలు ఆర్థిక సహాయం చేశారు. అలాగే సుంకన్న అనే స్నేహితుడు కింద పడి కాలు విరిగి బాధ పడుతుండడంతో చికిత్స కోసం మిత్రులందరూ కలిసి దాదాపు రూ.25 వేల  సహాయం చేశారు. అంతేకాక మండలంలోని బుజనూర్ గ్రామానికి చెందిన కరీముల్లా తోటి స్నేహితుడు బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోవడంతో పూర్వ విద్యార్థులు తోటి స్నేహితులు అందరూ కలిసి దాదాపుగా స్నేహితుని కుటుంబానికి రూ.1,35,000 ఆర్థిక సహాయం అందించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

మంజుల రమణ పూర్వ విద్యార్థి.. మేమందరము వివిధ వృత్తుల్లో స్థిరపడ్డాం మా బ్యాచ్ లో డాక్టర్లు, టీచర్లు ,రాజకీయ నాయకులు, పాత్రికేయులు, రైతులు అన్ని వృత్తుల వారు ఉన్నారు. చిన్నప్పుడు పాఠశాలలో మేము చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. సమాజంలో ఎవరితో ఎలా మెలగాలో మాకు చదువు నేర్పించింది. గురువులు నేర్పించిన సంస్కారం సమాజంలో మమ్మల్ని ఉన్నత స్థానంలో నిలిపింది. మూలాలు మరిచిపోకుండా మా దోస్తులు ఎవరైనా ఆపదలో ఉన్నారంటే కచ్చితంగా సహాయానికి వెనుకాడం ఉన్న లో కొంత మిత్రులకు సహాయం చేయడం చాలా ఆనందం కలిగిస్తుంది తల్లిదండ్రులు గురువులు మిత్రులు ఇదే మా కుటుంబం ఈ ఆలోచనలు పుట్టినది పూర్వ విద్యార్థుల సమ్మేళనం అందులో అందరినీ ఏకం చేసి వారి మంచి చెడు బాగోగులను కనుక్కొని గురువులను సన్మానించుకొని ఆర్థికంగా చితికిపోయిన స్నేహితులను ఆదుకోవడమే లక్ష్యంగా స్ఫూర్తి కొనసాగిస్తున్న గడివేముల మండలం  పూర్వ విద్యార్థులు సీనియర్లు జూనియర్లు అందరికి ఆదర్శంగా నిలవడం సంతోషంగా ఉంది ఈ సంప్రదాయం గతం 4 సంవత్సరాల క్రితం మొదలుపెట్టామని ప్రతి సంవత్సరం మా పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం కొనసాగుతోంది. జిల్లాలో గడివేముల మండలంలో ఈ సంప్రదాయం పలువురిని ఆదర్శంగా నిలుస్తోంది.

About Author