PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ్యాక్షన్ గ్రామాలలో కార్డెన్ సర్చ్

1 min read

పల్లెవెలుగు వెబ్, గడివేముల : కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని ఫ్యాక్షన్​ గ్రామాలలో ఆదివారం పోలీసులు కార్డెన్​ సెర్చ్​ చేశారు. సీఐ జీవన్​ గంగనాథ్​ బాబు, ఎస్​ఐలు శ్రీధర్​, పి. సుధాకర్​ రెడ్డి నేతృత్వంలో పోలీసులు గడివేముల మండలంలోని మంచాలకట్ట , పెసరవాయి గ్రామాలలోని ఇరువర్గాల నాయకుల ఇళ్లల్లో సోదా చేశారు. మంచాలకట్ట గ్రామంలో ఎటువంటి పత్రాలు లేని 8 ద్విచక్ర వాహనాలు సీజ్​ చేశారు. ఈ సందర్భంగా సీఐ జీవన్​ గంగనాథ్​ బాబు మాట్లాడుతూ గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామంలో ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సీఐ సూచించారు.


About Author