కౌలు రైతులకు కార్డులు తప్పనిసరి:ఎంఏఓ
1 min read
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : కౌలు రైతులు పొలం కౌలు రైతుల కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని ఓర్వకల్లు మండల వ్యవసాయ అధికారి సుధాకర్ అన్నారు. గురువారం కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండల పరిధిలోని నన్నూరు రైతు సేవా కేంద్రంలో కౌలు కార్డులు ఏ విధంగా పొందాలనే వాటి గురించి రైతులకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌలు రైతులు తప్పనిసరిగా తమకు కౌలు గుర్తింపు కార్డులు తీసుకోవాలన్నారు.ఈ కార్డుల ద్వారా రైతులు ప్రభుత్వం అందించే పలు పథకాలకు అర్హత పొందుతారని అన్నారు. ముఖ్యంగా సబ్సిడీ విత్తనాలు, పంటల బీమా,కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)అన్నదాత సుఖీభవ,అతివృష్టి/అనావృష్టి వల్ల కలిగే పంట నష్టపరిహారం వంటి పథకాలు ఉన్నాయని వివరించారు.మండలానికి 1250 కౌలు కార్డులు లక్ష్యంగా నిర్ధారించారని,ప్రతి కౌలు రైతు తమ గ్రామ విఆర్ఓ లేదా రైతు సేవా సిబ్బందిని సంప్రదించి కార్డులు పొందాలని రైతులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ భాస్కర్, రైతు సేవా కేంద్రం సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.