PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాలికల సంరక్షణ అందరి బాధ్యత… ఐసిడిఎస్‌ పిడి నిర్మల

1 min read

పల్లెవెలుగు   వెబ్  చాగలమర్రి :  బాలికల సంరక్షణ కోసం విద్యార్థుల తల్లిదండ్రులతోపాటు, ఉపాధ్యాయులు, అంగన్వాడి కార్యకర్తలు బాధ్యత తీసుకోవాలని ఐసిడిఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారిని నిర్మల అన్నారు. మండల కేంద్రమైన చాగలమరిలోని కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలలోబుధవారం అంతర్జాతీయ బాలిక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంతర్జాతీయ సంస్థ అక్టోబర్ 11వ తేదీన ప్రపంచ బాలికల దినోత్సవం గా గుర్తించిందన్నారు. కావున ప్రతి ఒక్కరూ బాలికల సంరక్షణ కోసం, అన్ని రంగాలలో బాలికలు గుర్తించి అభివృద్ధి చేయాలన్నారు. తల్లిదండ్రుల సహకారంతోపాటు, పాఠశాలలో కళాశాలలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాలన్నారు. ఉమెన్ వెల్ఫేర్ పరిరక్షణ కోసం మాక్ అసెంబ్లీ, మాకు పార్లమెంటు ద్వారా చట్టాల గురించి  అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాలు ప్రోత్సహించరాదని వాటి వల్ల జరిగే నష్టాలను విద్యార్థి దశ నుంచే వారికి తెలియజేయాలన్నారు. జిల్లాలో 1663 అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని వీటి ద్వారా నిత్యము పౌష్టికాహారము, గర్భవతులకు బాలింతలకు చిన్నారులకు అందిస్తున్నామన్నారు. 24294 మంది గర్భవతులు, 21, 472 మంది బాలింతలు అంగన్వాడి సెంటర్ల ద్వారా తొమ్మిది రకాల పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలోని 99 అంగన్వాడి సెంటర్లకు నాడు నేడు కింద 50 లక్షలు నిధులు మంజూరయ్యాయి అన్నారు. మరిన్ని నిధుల కోసం ప్రతిపాదనను పంపించడం జరిగిందని ఆమె తెలిపారు. బాలికలకు విద్యార్థి దశ నుండే వారి సంరక్షణ ఏ రంగంలో అభివృద్ధి చెందుతారో ఆ రంగానికి వారు ఉపయోగించుకుండేలా మనం ప్రోత్సహించాలని, తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలని కోరారు. ఈ సమావేశంలో కస్తూర్బా గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ సునీత అంగన్వాడి ఇన్‌చార్జ్‌ సూపర్‌వైజర్ రషీధాబేగం, అంగన్వాడి కార్యకర్తలు  చంద్రకళ , వహీదా, మైమున్, ఇందు,సుజాత,రహమత్, జి ఎం ఎస్ కే లు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

About Author