సన్న జీవాల పెంపకంలో మెలకువలు పాటించాలి
1 min read– గొర్రెల పెంపకందారుల శిక్షణా కేంద్రం ఉప సంచాలకులు డా పి.శాంతయ్య
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : పట్టణంలో.గొర్రెలు మరియు మేకల పెంపకంలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ సన్నజీవాల పెంపకందారులు ఆర్థికంగా లాభపడాలని ప్యాపిలి గొర్రెల పెంపకందారుల శిక్షణా కేంద్రం ఉప సంచాలకులు డా పి.శాంతయ్య తెలిపారు. బనగానపల్లె పట్టణ పశువైద్యశాలలో గురువారం జాతీయ పశుగణ మిషన్ సౌజన్యంతో ప్యాపిలి గొర్రెల పెంపకందారుల శిక్షణా కేంద్రం వారి ఆధ్వర్యంలో బనగానపల్లె మండలంలోని సన్న జీవాల పెంపకందారులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య్రమమంలో స్మైల్ విశాఖపట్నం వారు రూపొందించిన శిక్షణా మాడ్యూల్ ప్రకారంగా సన్న జీవాల పెంపకంలో మెలకువలు పాటించి సమయానికి వ్యాధి నిరోధక టీకాలు, నట్టల మందులు తాపించాలని సహాయ సంచాలకులు డాక్టర్ రామసుబ్బారెడ్డి, డాక్టర్ శ్రీనివాస రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో బనగానపల్లె పశువైద్య శాల సహాయ సంచాలకులు డాక్టర్ మారుతి సకరామ్, ప్యాపిలి శిక్షణా కేంద్ర పశువైద్యులు, బనగానపల్లె మండల పశువైద్యాధికారులు, సన్న జీవాల పెంపకందారులు తదితరులుపాల్గొన్నారు.