మంత్రి కుమారుడిపై కేసు నమోదు
1 min read
పల్లెవెలుగు వెబ్: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు సాయి కిరణ్‌పై కేసు నమోదైంది. ఖైరతాబాద్‌లో ఇటీవల నిర్వహించిన సదర్ ఉత్సవాల్లో సాయికిరణ్ పాల్గొని, తిరిగి వెళ్లే సమయంలో అతని కారు ఓ వ్యక్తిని ఢీకొట్టింది. దీంతో సదరు వ్యక్తి సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంతోష్ అనే వ్యక్తి ఎడమ పాదం పైనుంచి మంత్రి కుమారుడి కారు టైరు వెళ్లిందని పోలీసులు వివరించారు. ఈ ఘటనలో సంతోష్ గాయపడగా, కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి సాయికిరణ్‌పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని సైఫాబాద్ పోలీసులు తెలిపారు.