NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

తల్లిదండ్రుల పై కేసు

1 min read

అవకాశం ఇస్తే అమ్మానాన్న మీద పడి బతికేవాళ్ళు ప్రపంచంలో చాలా మందే ఉన్నారనిపిస్తోంది. విక‌లాంగుడైతే ఫ‌ర్వాలేదు. కానీ అన్నీ ఉండీ, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో డిగ్రీ పొంది కూడా తల్లిదండ్రులపైనే భారంమోపాలని భావిస్తున్నారు 40 ఏళ్ల ఓ కొడుకు. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన 41 ఏళ్ళ దుబాయ్‌కి చెందిన ఫయాజ్‌ సిద్దిఖీ అనే వ్యక్తి ఇటీవల తన తల్లిదండ్రులపై ఓ విచిత్రమైన దావా వేశారు. తాను జీవించి ఉన్నంత కాలం తన తల్లిదండ్రులే తనకి ఆర్థిక సాయం చేయాలంటూ సదరు కుమారుడు కోర్టుకెక్కారు. ధనవంతులైన తన తల్లిదండ్రులే తన భారాన్ని జీవిత కాలం మోయాలంటూ కేసుపెట్టారు. అందుకు కారణం తన ఆరోగ్య సమస్యలని చెప్పారు సిద్దిఖీ. తల్లిదండ్రుల నుంచి డబ్బు రాకపోతే .. తాను మానవ హక్కులు ఉల్లంఘనకు గురైనట్టేనంటారీయన. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందిన సిద్దిఖీ, కొన్ని చట్టపరమైన సంస్థల్లో పని కూడా చేశారు. అయితే 2011 నుంచి ఈయన నిరుద్యోగిగా ఉన్నారు. అంతేకాదు తనకి ఫస్ట్‌క్లాస్‌ రాకపోవడానికి ఆక్స్‌ఫర్డ్‌యూనివర్సిటీయే కారణమంటూ యూనివర్సిటీపై కూడా మూడేళ్ళ క్రితం దావా వేసేందుకు ప్రయత్నం చేశారు. అక్కడ టీచింగ్‌ బాగాలేదని, అది తన కెరీర్‌కి నష్టం చేసిందని సిద్దిఖీ వాదించారు.

About Author