పరిటాల శ్రీరామ్ మీద కేసు
1 min readపల్లె వెలుగు వెబ్: తెలుగుదేశం నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర కుమారుడు పరిటాల శ్రీరామ్ మీద కేసు నమోదైంది. రామగిరి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నాగస్వామి తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ నాగస్వామి తెలిపారు. ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలో అనిత అనే ఆశా వర్కర్ ను కొందరు ఇబ్బంది పెట్టారు. ఈ నేపథ్యంలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెకు మద్దతుగా పరిటాల సునీత మాట్లాడారు. ఘటనను ఖండించారు. దీని మీద ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి స్పందిస్తూ .. టీడీపీ నేతలు డ్రామాలు ఆడుతున్నారని, పరిటాల శ్రీరామ్ మీద ఉన్న కేసులకు జిల్లా విడిచే పరిస్థితి ఉందని ఆయన అన్నారు. దీనికి కౌంటర్ గా పరిటాల శ్రీరామ్ ప్రెస్ మీట్ పెట్టారు. ధైర్యం ఉంటే తనను జిల్లా విడిపించే ప్రయత్నం చేయండి అంటూ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే శ్రీరామ్ మీద కేసు నమోదైంది.