బెల్లం ఊట ద్వంసం..ఇద్దరిపై కేసు నమోదు అరెస్ట్
1 min read
ప్రొహిబిషన్ ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు..
నందికొట్కూరు, న్యూస నేడు: నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలో నాటు సారా స్థావరాలపై మూకుమ్మడిగా దాడి చేసి బెల్లం ఊటను ధ్వంసం చేసినట్లు నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ సీఐ ఎస్ రామాంజనేయులు తెలిపారు.కర్నూలు డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ శ్రీదేవి మరియు నంద్యాల జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి ఎస్ రవికుమార్ ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రాముడు ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలోని నీలిషికారి కాలనీలో బుధవారం జరిపిన దాడుల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ లక్ష్మణ దాసు,నందికొట్కూరు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ సీఐ రామాంజనేయులు,ఎస్ఐ జఫురుల్లా,ఆత్మకూరు సీఐ కిషోర్ కుమార్,ఎస్ఐ జగదీష్ బృందాలు మూకుమ్మడిగా జరిపిన దాడుల్లో 300 లీటర్ల నాటుసారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం ఊట ధ్వంసం చేసి,10 లీటర్ల నాటుసారా సీజ్ చేసి,ఇద్దరు వ్యక్తులు షికారి మీనాక్షి(26),షికారి గంగా(21)లపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సీఐ రామాంజనేయులు తెలిపారు. తర్వాత నీలిషికారి కాలనీ వాసులకు నవోదయం 2.O కార్యక్రమంలో భాగంగా సారాను రూపుమాపేందుకు గాను కాలనీ ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు.