PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐటీడీపీ పై కేసు న‌మోదు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : న్యూడ్‌ వీడియోతో అప్రతిష్ట పాలైన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఈ ఘటనపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీంతో సీఐడీ అధికారులు ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి చెందిన ఐటీ విభాగం ‘ఐ-టీడీపీ’పై కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం 66(సీ)తోపాటు ఐపీసీలోని 465, 469, 471, 153(ఏ), 505(2) రెడ్‌ విత్‌ 120-బీ సెక్షన్ల కింద మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎంపీ మాధవ్‌ ఫిర్యాదులో ఏం పేర్కొన్నారంటే.. ‘‘వెనుకబడిన వర్గాల్లో పుట్టిన నేను సమాజంలో గుర్తింపు తెచ్చుకుని ఎంపీగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని రాజకీయ ప్రత్యర్థులు నాపై మార్ఫింగ్‌ వీడియో కుట్ర చేశారు. అసత్య ఆరోపణలు చేసి రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించిన వ్యక్తులే నకిలీ వీడియోతో తప్పుడు ప్రచారానికి దిగారు. ఆగస్టు 4న వేకువజాములో 2.07గంటలకు నాకు ఈ నకిలీ వీడియో వైరల్‌ గురించి తెలిసింది. ఉద్దేశపూర్వకంగానే ఐ-టీడీపీ వాట్సాప్‌ గ్రూప్‌లో యూకే నెంబరు 447449703968తో పోస్టు చేసి నాకు తీరని నష్టం కలిగించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌, టీడీపీ నేత చింతకాయల విజయ్‌ ఈ వ్యవహారానికి బాధ్యులు. నకిలీ వీడియో వ్యవహారంలో నేను మాత్రమే నష్టపోయా. ఇతరులు ఎవరూ నాపై ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదు’’ అని పేర్కొన్నారు.

                                                         

About Author