NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌రాటే క‌ళ్యాణి పై కేసు న‌మోదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప‌్రముఖ సినీ న‌టి క‌రాటే క‌ళ్యాణి పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. మైన‌ర్ బాలిక పై జ‌రిగిన అత్యాచారం వివ‌రాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసిన కేసులో ఆమె పై కేసు న‌మోదు చేశారు. కొన్ని నెల‌ల క్రితం సైదాబాద్ లోని సింగ‌రేణి కాల‌నీలో ఓ మైన‌ర్ బాలిక పై అత్యాచారం జ‌రిగింది. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఆ సంద‌ర్భంగా క‌రాటే క‌ళ్యాణి బాధితురాలి త‌ర‌పున గ‌ళ‌మెత్తారు. బాధితురాలి వివ‌రాలు ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేశార‌ని ఎల్ల‌మ్మ బండ ప్రాంతానికి చెందిన నితేష్ అనే వ్య‌క్తి రంగారెడ్డి కోర్టులో ఆమె పై ప్రైవేట్ కంప్లైంట్ దాఖ‌లు చేశారు. కోర్టు ఆదేశాల మేర‌కు జ‌గ‌ద్గిరి గుట్ట పోలీస్ స్టేష‌న్ లో ఆమె పై కేసు న‌మోదు చేశారు.

                                         

About Author