NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప‌రుగుల రాణి పిటి ఉష పై కేసు న‌మోదు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేర‌ళ‌లో ప‌రుగుల రాణి పీటీ ఉష పై కేసు న‌మోదైంది. ఉష మోసం చేశారంటూ మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ఓ బిల్డ‌ర్ తో క‌లిసి ఉష త‌న‌ను మోసం చేశార‌ని జోసెఫ్ ఆరోపించారు. ఉష హామీతో కోజికోడ్ లో 1012 చ‌ద‌ర‌పు అడుగుల స్థ‌లాన్నికొనుగోలు చేసిన‌ట్టు చెప్పారు. ఈ స్థ‌లం కోసం విడ‌త‌ల వారీగా 46 ల‌క్ష‌లు చెల్లించిన‌ట్టు జెమ్మా జోసెఫ్ తెలిపారు. అయితే స్థ‌లాన్ని త‌న పేర రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండా ఆలస్యం చేస్తున్నార‌ని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. జెమ్మా జోసెఫ్ ఫిర్యాదుతో ఉష‌తో స‌హా నిర్మాణ సంస్థ తోపాటు మ‌రో ఆరుగురి పై కేసు న‌మోదు చేశారు. స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించారు.

                                    

About Author