NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం జ‌గ‌న్ పై కేసులు ఎత్తేశారు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ పై ఉన్న పలు కేసులు ఎత్తేశారు. త‌ప్పుడు కేసుల‌ని కొన్నింటిని, మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటూ మ‌రికొన్ని, మిస్టేక్ ఆఫ్ లా, ఆధారాలు లేవ‌ని మ‌రికొన్ని కేసుల‌ను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసింది. ఆయా కేసుల ద‌ర్యాప్తు అధికారులు న్యాయ‌స్థానాల్లో క్లోజ‌ర్ రిపోర్టులు దాఖ‌లు చేశారు. యాక్షన్ డ్రాప్డ్ పేరుతో కొన్ని కేసులో న్యాయ‌స్థానంలో విచార‌ణ లేకుండా మూసేశారు. గ‌తేడాది సెప్టంబ‌ర్ 16 త‌ర్వాత ఈ కేసుల ఎత్తివేత వ్యవ‌హారం సాగింది. ద‌ర్యాప్తు అధికారులు సంబంధిత డీఎస్పీల నుంచి అనుమ‌తి తీసుకుని.. త‌ర్వాత న్యాయ‌స్థానంలో క్లోజ‌ర్ రిపోర్టు దాఖ‌లు చేసి కేసుల‌ను ఎత్తేశారు. అలా ఎత్తేసిన 11 కేసుల పై బుధ‌వారం హైకోర్టు సుమోటోగా విచార‌ణ చేప‌ట్టింది. హైకోర్టు విచార‌ణ ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది.

About Author