ఉపాధిలో తిరిగి చెల్లించాల్సిన నగదు-47,403
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రమైన ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో శుక్రవారం ఉపాధి హామీ పథకంపై 16వ బహిరంగ సభ(సామాజిక తనిఖీ) జరిగినది.09.04.2022 నుండి 31.03.2023 వరకు మరియు ఈ సంవత్సరం ఆగస్టు నెల కాంక్రీట్ ఆడిట్ చేపట్టారు.ఈనెల ఆరవ తేదీ నుండి మండలంలోని వివిధ గ్రామాలలో వివిధ పనులు చేపట్టిన వాటిపై ఆడిట్ నిర్వహించారు.వివిధ గ్రామాల్లో చేపట్టిన పనుల్లో పనులు చేయకున్నా చేసినట్లు నిర్ధారణ కావడంతో ఆ నగదు తిరిగి చెల్లించాలని తేలింది. మండలం మొత్తం 47,403 రూ.లు(తిరిగి కట్టాల్సిన నగదు మరియు జరిమానా)వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు చెల్లించాలని ఆత్మకూరు ఏపీడి అన్వరా బేగం అన్నారు.గ్రామాల వారీగా తిరిగి చెల్లించాల్సిన నగదు వివరాలు:వీపనగండ్ల 2500, 49 బన్నూరు 2వేలు,నాగలూటి 1000,పైపాలెం 1000,సుంకేసుల 1600, మాసపేట 1349,చెరుకుచెర్ల 1500,కడుమూరు 3500, జలకనూరు 1169,తలముడిపి 6397, తిమ్మాపురం 1000, మిడుతూరు 2626, చౌటుకూరు 1041,రోళ్లపాడు 2220 రూపాయలు తిరిగి చెల్లించాలని అధికారులు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నంద్యాల ఎపిడి బాలాజీ నాయక్,జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అధికారి గంగాధర్,ఎంపీడీఓ జిఎన్ఎస్ రెడ్డి,ఏపీఓ జయంతి,ఈసీ నరేష్,టిఏలు,ఎఫ్ఏలు పాల్గొన్నారు.