PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రూ.3.05 కోట్లు నగదు స్వాధీనం

1 min read
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ డా. ఫక్కీరప్ప

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ డా. ఫక్కీరప్ప

– అంతర్రాష్ట సరిహద్దు చెక్​ పోస్టు వద్ద పట్టివేత
– వెల్లడించిన ఎస్పీ ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్​, కర్నూలు క్రైం: కర్నూలు నగర శివారులోని పంచలింగాల అంతర్ రాష్ట్ర చెక్ పోస్టు వద్ద శుక్రవారం సెబ్​, సివిల్​ పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా. ఎటువంటి బిల్లులు, ఆధారాలు లేనందున రూ.3 కోట్ల 5 లక్షల 5వేల 500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ డా. ఫక్కీరప్ప తెలిపారు. బెంగుళూరు చెందిన బి.ఏ. చేతన్​ కుమార్​ హైదరాబాద్ నుంచి ఎస్ఆర్​ ఎస్ ట్రావెల్స్ బస్సులో కర్నూలు మీదుగా బెంగుళూరు కు బయలు దేరాడు. కర్నూలులోని పంచలింగాల చెక్​ పోస్టు వద్ద వాహనాలు తనిఖీలో భాగంగా సెబ్​ సీఐ లక్ష్మి దుర్గయ్య, సివిల్​ పోలీసులు ఎస్​ఆర్​ఎస్​ ట్రావెల్​ బస్సును తనిఖీ చేశారు. చేతన్​ కుమార్​ వద్ద రూ. రూ.3 కోట్ల 5 లక్షల 5వేల 500 నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారించగా తమిళనాడు రాష్ట్రం, చెన్నై లో ఉన్న రామచంద్ర మెడికల్ కళాశాల చెందిన వారిదని చేతన్ కుమార్ తెలిపారు. కాగా డబ్బుకు సంబంధించిన బిల్లులు, ఆధారాలు లేకపోవడంతో తాలూకా పోలీసులు క్రైమ్ నెంబర్ 299/2021 U/S … 102 CRPC క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న నగదు ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్ మెంట్ వారికి అప్పగిస్తున్నామన్నారు.
రెండు నెలల్లో.. 8 కోట్లు పట్టివేత : కర్నూలు సరిహద్దు పంచలింగాల చెక్ పోస్టు వద్ద రెండు నెలల్లో జరిగిన స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరో మరియు లోకల్ పోలీసుల తనిఖీలో రూ. 8 కోట్ల నగదు, 25 కేజిల బంగారం, 12 కేజిల వెండి, 500 గ్రాములు డైమాండ్స్ పట్టుబడ్డాయన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 10 అంతర్ జిల్లా చెక్ పోస్టులు, 5 స్టేట్ బార్డర్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో సెబ్ అడిషనల్ ఎస్పీ గౌతమిసాలి ఐపియస్ గారు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ మహేశ్వరరెడ్డి, కర్నూలు పట్టణ డిఎస్పీ కె.వి మహేష్, కర్నూలు తాలుకా సిఐ విక్రమసింహా, తాలుకా ఎస్సై ఖాజా వళి ఉన్నారు.



About Author