PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గుడివాడలో క్యాసినో ఆరోపణలు.. కొడాలి నానికి ఆర్జీవీ మద్దతు !

1 min read

పల్లెవెలుగువెబ్ : గుడివాడలో కొడాలి నానికి చెందిన కన్వెన్షన్ సెంటర్లో గోవాకు చెందిన క్యాసినో నిర్వాహకుల పర్యవేక్షణలో జూదం నిర్వహించారని టీడీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం పై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. గుడివాడ ఆధునికీకరణకు కృషి చేస్తున్న కొడాలి నానికి నా అభినందనలు. ఆయనకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నా. క్యాసినోకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తున్న వారిని పట్టించుకోవద్దు. పారిస్, లాస్ వెగాస్, లండన్ వంటి దేశాల జాబితాలో గుడివాను ఉంచేందుకు ప్రయత్నిస్తున్న నానిని మెచ్చుకోవాలి. గోవా సంస్కృతిని గుడివాడకు తీసుకువచ్చిన నానిని విమర్శిస్తున్న వాళ్లు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి. గుడివాడ ప్రజలు గోవా వెళ్లగలరు కానీ గోవాలో నివసించేవాళ్లు గుడివాడ రారు అని ఆర్జీవీ ట్వీట్ చేశారు.

       

About Author