NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలి

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: శ్రీశైలం మాజీ MLA మాన్యశ్రీ.బుడ్డా రాజశేఖరరెడ్డి గారి ఆదేశానుసారం ఆత్మకూర్ పట్టణంలోని నారాయణ విద్యావిహార్ హైస్కూల్ లో పట్టభద్రులతో సమావేశమై పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ MLC అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారికి తమరి అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని శ్రీశైలం నియోజకవర్గ తెలుగుయువత ప్రధాన కార్యదర్శి పస్పిల్ మున్నా విజ్ఞప్తి చేసారు. మున్నా మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి అధికారంలో వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులతో ఓట్లు వేయించుకుని గెలిచి నేటికి 3 సంవత్సరాలైన జాబ్ క్యాలెండర్ ఊసే లేదన్నారు, నిరుద్యోగుల కోసం నోటిఫికేషన్&నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి అబద్ధం చెప్పారన్నారు, 25 మంది MP లు గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా, నిరుద్యోగులకు పరిశ్రమలు తెస్తా అని చెప్పి ప్రత్యేక హోదా అడగడమే మరిచిపోయారన్నారు, నిరుద్యోగుల కోసం మెగా DSC ఇస్తా అని చెప్పి ఉత్తుత్తి హామీ ఇచ్చారన్నారు, చట్ట సభల్లో నిరుద్యోగుల కోసం ప్రశ్నించే దమ్మున్న నాయకుడు భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారిని పట్టభద్రుల ఎన్నికల్లో ప్రతిఒక్కరు తమ పవిత్రమైన ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేసారు.ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గ తెలుగునాడు విద్యార్థి సమాఖ్య ఉపాధ్యక్షుడు మునీర్ అహ్మద్, టీడీపీ 7వ వార్డ్ మైనారిటీ నాయకులు పాన్ మహమ్మద్, మహేబూబ్,రాజు మరియు పట్టభద్రులు పాల్గొనడం జరిగింది.

About Author