PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కుల జనగణన లెక్కలు తీయాల్సిందే

1 min read

– రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్.
– చర్చా వేదికలో పాల్గొన్న నాయకులు .
పల్లెవెలుగు వెబ్ వెలుగోడు: తగిన వివరాలు లేకుండా , ఏ కులన్నాయినా , ఏ వర్గన్నైనా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు ఎలా రచిస్తారని , కుల జనగణన తప్పనిసరి అని జాతీయ బి.సి.సంక్షేమ సంఘము రాష్ట్ర కార్యదర్శి ఎస్.రఘు రాముడు యాదవ్ , మాజీ పిపి ,లాయర్ రవి కుమార్ , ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యదర్శి నాగశేషులు , టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఖలీలుల్లా ఖాన్ అన్నారు. స్థానిక లిటిల్ ఏంజిల్స్ పాఠశాల లో ఆదివారం సాయంత్రం కుల జనగణన ప్రాధాన్యత – ప్రభుత్వాల తీరు పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కులాల వారిగా జనగణన జరపాలంటూ రోజు రోజుకు డిమాండ్ పెరుగుతుందని అన్నారు. భారత దేశంలో కులాల వారిగా జనాభా గణనను 1872 లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం చేపట్టిందని , 1931 నుంచి ఈ తరహా గణన ఆగిపోయిందని అన్నారు.పదేళ్ళ కోసారి దేశంలో జనాభా లెక్కిస్తున్న , అందులో దళితులు , ఆది మవాసిల సంఖ్య మాత్రమే చూపిస్తున్నారని , ఓబీసీ లు ఎండరున్నారనే లెక్కలు లేవని అన్నారు.మిత్ర పక్షాలు సహా , అన్ని రాజకీయ పార్టీలు ఓబీసీ జనాభా గణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.వెనుకబడిన వర్గాల వివరాల విషయంలో సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వం తన ఆశక్తతను వ్యక్తం చేసిందని , 2011 నాటి జనగణన సందర్భంగా సేకరించిన వెనుకబడిన వర్గాల వివరాలు తప్పుల తడకగా ఉన్నాయని ,ఇకముందు ఈ డేటా సేకరించ లేమని కేంద్రం తన అఫిడవిట్ లో తెలిపిందని అన్నారు.కొందరు చెబుతున్నట్లు కులాల వివరాలు సేకరిస్తే వైషమ్యాలు పెరుగుతాయనేది అర్థము లేని వాదన అని తెలిపారు. ఏయే ప్రాంతాల్లో , ఏయే వర్గాల సామాజిక , ఆర్థిక పరిస్థితి ఏ విదంగా ఉన్నదో తెలుపకుండా , ప్రణాళికలను రూపొందించడం చీకటిలో బాణం వేసినట్లు ఉంటుందని అన్నారు. సామాజిక , ఆర్థిక వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్న మన సమాజంలో గణాంకాలకు మరింత ప్రాధాన్యత ఉంటుందని , కేంద్రం ఇప్పటికైనా కులాల వారీగా జనగణన అవసరాన్ని గుర్తించాలని చెప్పారు.1979లో వెనుకబడిన కులాల గుర్తింపు కు అప్పటి ప్రభుత్వం ఒక కమిషన్ ను ఏర్పాటు చేసిందని , ఈ కమిషన్ కు నేతృత్వం వహించిన బిందెశ్వరీ ప్రసాద్ ఓబీసీ లకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పిందని ,కానీ 1990 లో వి.పి.సింగ్ ప్రభుత్వం ఈ నివేదిక ను అమలు పరిచేంతవరకు ఈ రిపోర్టు ను ఎవరూ పట్టించుకోలేదని అన్నారు.అగ్రవర్ణాల లోని వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు వల్ల 50 శాతం పరిమితి అనుల్లంఘనీయం కానప్పుడు , ఓబీసీ లకు ఎస్సి, ఎస్టీ ల వలే రిజర్వేషన్లు పెంచే చర్యలు తీసుకోవడం అవసరమని అన్నారు. 1931 బ్రిటిష్ వారి సెన్సస్ పై ఆధార పడకుండా , అందరూ కోరుతున్నట్లు అన్ని కులాల జనగణన కచ్చితంగా తీయాలని , అపుడే అన్ని వివాదాలకు పరిస్కారం లభిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో వేల్పనూరు గ్రామ కార్యదర్శి సుంకన్న , బి.సి.నాయకులు గోగుల రాము , నాగేశ్వరరావు యాదవ్ , ఎల్లయ్య , చెన్నారాయుడు , బోయమౌలాలి , వైసీపీ నాయకులు తెలుగు రామచంద్రుడు , తెలుగు నాగేశ్వరరావు పాల్గొన్నారు.

About Author