కళ్లకలక ఓ వైరస్ లాంటిది: డాక్టర్ నితీష్ కుమార్
1 min read
పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: కళ్లకలక ఓ వైరస్ లాంటిదని ప్యాపిలి పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నితీష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వైరస్ లా కళ్లకలకలు వస్తున్నాయన్నారు. కళ్లకలక వచ్చినవారు చాలా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇంట్లో వారు వాడే వస్తువులు విడిగా ఉంచుకోవాలని, గాలి తగలకుండా కళ్లజోళ్లు పెట్టుకొవాలి,ఈ వైరస్ ఇతరులకు సోకకుండా దూరంగా ఉండాలని సూచించారు.