ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుని నిలువ చేయండి…
1 min read
వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్.
కర్నూలు , న్యూస్ నేడు: ప్రతి వర్షపు బొట్టును ఒడిసి పట్టుకొని వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్ పాటిల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు.సోమవారం మధ్యాహ్నం న్యూఢిల్లీ నుండి జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరూ నీటిని ఒడిసి పట్టుకొని సద్వినియోగం చేసుకొనే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశంలోని కొన్ని ప్రాంతాల కలెక్టర్ల పనితీరును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా క్రొత్తగా ఏమి చేస్తున్నారు తెలుసుకుని సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. వారు చేసిన వాటిని ఇతర ప్రాంతాల్లో కూడా అమలు చేసే విధంగా చర్యలు ఉండాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ నిధులు , పారిశ్రామికవేత్తల ఆర్థిక సహాయం మరియు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నీటి సంరక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.” కర్మభూమి , మాతృభూమి కే లియే కుచ్ కర్నా హై ” అన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరిక మేరకు జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకొని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులతో మాట్లాడుతూ… మీ మీ పరిధిలో జరుగుతున్న జల్ సంచై , జన్ భాగిదారి పనులు చేయవలసిందిగా ఆదేశించారు. జరుగుతున్న పనుల వివరాలు మరియు జరిగిన పనుల వివరాలు యాప్ లో అప్లోడ్ చేయవలసిందిగా ఆదేశించారు.ఈ సందర్భంగా పిడి డ్వామా కు … ఫారం పాండ్స్ , డగౌట్ పాండ్స్ , చెక్ డామ్ లు, అమృత సరోవర్, పర్కులేషన్ ట్యాంకులు, తదితర పనుల వివరాల నివేదిక కలెక్టర్ కు అందచేయవలసిందిగా ఆదేశించారు.ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ ని… బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ , కమ్యూనిటీ సోక్ పిట్ తదితర పనుల వివరాల నివేదిక కలెక్టర్ కు అందచేయవలసిందిగా ఆదేశించారు.ఎస్సీ ఇరిగేషన్ ను… చెరువులు , మైనర్ డామ్ ల పునరుద్ధరణకు చేపడుతున్న పనుల తదితర వివరాల నివేదిక కలెక్టర్ కు అందచేయవలసిందిగా ఆదేశించారు.కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి ట్రైనీ కలెక్టర్ చల్లా కళ్యాణి , ఆర్డబ్లుఎస్ ఎస్ ఈ నాగేశ్వర రావు , పి. డి. డ్వామా వెంకటరమణయ్య ,ఇరిగేషన్ ఎస్ఈ ద్వా రకనాథ్ రెడ్డి, డి డి. గ్రౌండ్ వాటర్ శ్రీనివాసా రావు పాల్గొన్నారు.