వివేక హత్య కేసు… 5 లక్షల రివార్డ్ ప్రకటించిన సీబీఐ
1 min readపల్లెవెలుగు వెబ్ : వైఎస్ వివేక హత్య కేసులో సీబీఐ కీలక ప్రకటన చేసింది. కేసుకు సంబంధించిన కచ్చితమైన, నమ్మదగిన సమాచారం అందిస్తే వారికి 5 లక్షల రూపాయల రివార్డు అందిస్తామని ప్రకటించింది. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీబీఐ హామీ ఇచ్చింది. ఫోన్ నెంబర్ల ద్వార కానీ, సీబీఐ కార్యాలయంలో కానీ సమాచారం అందించవచ్చని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు పత్రికా ప్రకటన ఇచ్చింది. ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపింది. గత ఏడాది నుంచి విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు.. ఇప్పటికే పలువురు అనుమానితుల్ని విచారిస్తున్నారు.