వైసీపీ నేతను అరెస్టు చేసిన సీబీఐ
1 min readపల్లెవెలుగువెబ్ : ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ దూకుడు పెంచింది. సత్యసాయి జిల్లా పరిధిలోని హిందూపురం మునిసిపల్ కౌన్సిలర్, వైసీపీ నేత మారుతీ రెడ్డిని సీబీఐ మంగళవారం అరెస్ట్ చేసింది. ఇప్పటికే హిందూపురంలోని మారుతీ రెడ్డి ఇంటికి రెండు సార్లు వెళ్లిన సీబీఐ అధికారులు ఆయనను ఈ కేసు విషయంలో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. సోమవారం రెండో సారి ఆయనను ప్రశ్నించిన సీబీఐ అధికారులు… ఆ మరునాడే అరెస్ట్ చేయడం గమనార్హం.