వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం
1 min read
పల్లెవెలుగు వెబ్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. శంకర్ రెడ్డి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలుసుకున్న సీబీఐ అధికారులు .. అతన్ని అదుపులోకి తీసుకోని కోఠిలోని సీబీఐ కార్యాలయానికి తరలించారు. ఇవాళ సాయంత్రం శంకర్రెడ్డిని విచారించే అవకాశం ఉంది. కాగా, ఈ కేసులో మరో అనుమానితుడు దస్తగిరి ఇటీవల ఇచ్చిన వాంగ్మూలంతో రాజకీయంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.